Monday, February 2, 2026

ఒంటరితనం –మౌనంగా వ్యాపిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభమా?

Dr. keshavulu Bashavathini. MD. psy. Osm .

ఒంటరితనం (Loneliness) స్వతహాగా ఒక మానసిక వ్యాధి (Mental Disorder) కాదు. కానీ ఆధునిక మానసిక వైద్య శాస్త్రం ప్రకారం ఇది తీవ్ర ప్రమాదకారక కారకం (Major Risk Factor). ఒంటరితనం అంటే “ఒంటరిగా ఉండటం” కాదు; సామాజిక సంబంధాలు ఉన్నా భావోద్వేగ అనుబంధం లేకపోవడం.
శాస్త్రీయంగా దీనిని ఇలా నిర్వచిస్తున్నారు.

Subjective Social Isolation – మనకు కావలసిన అనుబంధం దొరకడం లేదు అనే అనుభూతి, ఇది డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యలకు దారితీస్తుంది.
World Health Organization ప్రకారం, Loneliness is a significant determinant of mental and physical health, comparable to smoking and obesity.

ఒంటరితనం → మానసిక రుగ్మతలు : కారణం–ఫలిత శ్రేణి
Scientific Causal Pathway (Cause–Effect Model):
ఒంటరితనం
→ దీర్ఘకాలిక ఒత్తిడి (Chronic Stress)
→ కార్టిసాల్ హార్మోన్ పెరుగుదల .
→ మెదడులో సెరోటోనిన్ & డోపమిన్ తగ్గుదల .
→ డిప్రెషన్, ఆందోళన, ఆత్మవిశ్వాసలోపం .

The Lancet Psychiatry (2022) ప్రకారం తీవ్రమైన ఒంటరితనం ఉన్నవారిలో డిప్రెషన్ ప్రమాదం 2.3 రెట్లు ఎక్కువ, ఆత్మహత్య ఆలోచనలు 3 రెట్లు ఎక్కువ, భారతదేశంలో (ICMR–NIMHANS అధ్యయనం), పట్టణ యువతలో 36–40% మందికి క్లినికల్ స్థాయి ఒంటరితనం లక్షణాలు.

ఆత్మహత్యలు & ఒంటరితనం – మౌన సంబంధం…
ఇటీవలి ఆత్మహత్య కేసుల విశ్లేషణలో ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తోంది,
ఒంటరితనం + భావోద్వేగ మద్దతు లోపం = అధిక ఆత్మహత్య ప్రమాదం.

National Crime Records Bureau (India) డేటా విశ్లేషణ ప్రకారం ఆత్మహత్య చేసినవారిలో, 60% పైగా – కుటుంబ/సామాజిక సంబంధాల లోపం, 45% – “నాతో మాట్లాడే వ్యక్తి లేడు” అన్న భావన, వివాహితులు అయినా ఒంటరితనం అనుభవించినవారీ సంఖ్య పెరుగుతూనే ఉంది.

Psychological Autopsy Studies చెపుతున్న ప్రకారము..
Most suicides are not due to mental illness alone, but due to untreated loneliness combined with stress.

మానసిక వైద్య నిపుణుల లోపమా? –

ఇది వ్యక్తిగత వైద్యుల తప్పిదం కాదు; ఇది సిస్టమిక్ గ్యాప్. ఒంటరితనాన్ని స్వతంత్ర సమస్యగా స్క్రీనింగ్ చేయడం లేదు, OPDల్లో 5–7 నిమిషాల కన్సల్టేషన్ – లోతైన సామాజిక అంచనా అసాధ్యం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో ఒంటరితనంపై ప్రత్యేక దృష్టి లేదు,

India Mental Health Atlas (2023):
1 లక్ష జనాభాకు సైకియాట్రిస్టులు: 0.75 మాత్రమే, సైకాలజిస్టులు/సోషల్ వర్కర్లు ఇంకా తక్కువ, ఫలితంగా ఒంటరితనం గుర్తించబడకుండా డిప్రెషన్ దశకు చేరుతుంది.

పరిష్కారం – శాస్త్రీయ & సామాజిక మార్గాలు (Evidence-Based Interventions):

A) Clinical Level :
OPDలో Loneliness Scale (UCLA Loneliness Scale) వినియోగం,
మందులతో పాటు Group Therapy, Family Therapy.

B) Community Level :
వృద్ధులకు, యువతకు సామాజిక అనుబంధ కేంద్రాలు
స్కూల్ & కాలేజీల్లో Emotional Literacy Programs.

C) Policy Level :
ఒంటరితనాన్ని Public Mental Health Indicatorగా గుర్తించడం,
స్థానిక ప్రభుత్వాల ద్వారా Community Mental Health Workers.

హెచ్చరిక :

ఒంటరితనం కనిపించదు… కానీ చంపుతుంది.
ఇది ఒక వ్యాధి కాకపోయినా,
అనేక మానసిక వ్యాధులకు తలుపు తెరచే మౌన శక్తి.
ఒంటరితనాన్ని గుర్తించకపోవడం – వ్యక్తి తప్పు కాదు,
కానీ సమాజం & వ్యవస్థల బాధ్యత.
మానసిక ఆరోగ్యానికి మందులే కాదు… మనుషులూ అవసరం.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img