Friday, August 29, 2025

ప్రెసిడెంట్ ట్రంప్ మోసగాడా ? మిత్రుడా ? అవకాశవాదియా ? డా. కేశవులు హాట్ కామెంట్స్

డా. కేశవులు భాషవత్తిని, M.D. సైకియాట్రీ.
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.

డొనాల్డ్ ట్రంప్… ఒక వ్యాపారవేత్త, టీవీ రియాలిటీ స్టార్, రాజకీయ పరంగా అసాధారణమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో గుర్తింపు పొందిన వ్యక్తి. అమెరికా అధ్యక్షుడిగా ఆయన పాలన ప్రపంచ రాజకీయాలను తిరగ రాస్తోంది. ఫలితంగా ప్రపంచ ఆర్ధిక, వ్యూహాత్మక, రక్షణ, వాణిజ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశానికి ఇది ప్రత్యేకంగా ప్రమాదకరం ఎందుకంటే… ఒక్కోసారి వ్యక్తుల వ్యక్తిత్వమే దేశాల మధ్య సంబంధాల ప్రకృతిని మలుపుతిప్పుతుంది. మోదీ – ట్రంప్ లాంటి వ్యక్తిత్వవాద నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహం చూసినప్పుడు మనలో కొందరికి ఆశ – ఇంకొందరికి అనుమానం కలుగుతుంది. ట్రంప్ మిత్రుడే అని నిర్ధారించుకోవాలంటే ఆయన పాలనలో భారత్‌కి జరిగిన వాస్తవాలను పేజీపై తెచ్చుకోవాలి.ట్రంప్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలుసు — అణగారిన వర్గాలను అణగదీయగలాడు, పాకిస్తాన్‌కు ‘గుడ్ బాయ్’ చెప్పి మళ్లీ ముద్దు పెడతాడు, భారత్‌తో ముద్దుగా మాట్లాడి వీసా నిరాకరణతో తలకొట్టగలడు. అలాంటి ద్వంద్వవ్యక్తిత్వం కలిగిన ట్రంప్ – మనకు మిత్రుడా? లేక శత్రువా? మోదీ–ట్రంప్ అనుబంధం ఉపరితలమంతే వాస్తవానికి, ఆయన రాజకీయ అజెండా “అమెరికా ఫస్ట్”లో భారత్ కోసం స్థానం లేదు…

ఆదినుంచే అదే….

ట్రంప్ పాలనలో ప్రధాన లక్ష్యం అమెరికా ప్రయోజనాలే. ఇతనికి అంతర్జాతీయ మిత్రబంధాలు కన్నా, వాణిజ్య లాభాలు ఎక్కువగా ముఖ్యం. భారత్‌ను మిత్రదేశంగా చూసే ఓ సాంకేతిక మిత్రత్వం ట్రంప్ దగ్గర ఉన్నప్పటికీ, అది వాణిజ్యం, పెట్టుబడులు, ఆయుధ విక్రయాలపైనే ఆధారపడి ఉంటుంది.ట్రంప్ చైనా మీద ఆగ్రహంతో భారత్‌కు మద్దతు పలికినట్టు కనిపించినా, అది చైనాపై ఒత్తిడి పెంచేందుకే. అమెరికా నుండి భారత్‌కు H1B వీసాల విషయంలో పరిమితులు పెంచిన ఘటనలు గుర్తు పెట్టుకోవాలి.అఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కు తీసుకోవడంలో పాకిస్తాన్‌తో ఒప్పందాలు చేసుకోవడాన్ని కూడా మర్చిపోకూడదు. ట్రంప్ తన స్వార్థానికి అనుగుణంగా భారతదేశాన్ని ఉపయోగించుకుంటాడు. మనం దీన్ని అర్థం చేసుకుని, జాగ్రత్తగా వ్యవహరించాలి.

హౌడీ మోడీ –

2019లో అమెరికాలో “హౌడీ మోడీ” అనే బహుళ జన సముదాయ సమావేశం ట్రంప్ హాజరైన ఘనత గల సభ. ప్రపంచ రాజకీయాలలో అత్యంత పెద్ద గమనించదగిన సంఘటనగా అప్పట్లో అంకితం చేయబడింది. అదే తరహాలో “నమస్తే ట్రంప్” అనే కార్యక్రమం గుజరాత్‌లో జరిగింది. అయితే ఇవి కేవలం ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికాలో భారతీయ వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నమా? లేక భారత్‌తో దీర్ఘకాలిక మైత్రీ నిర్మాణానికి బీజమా? ఒకవేళ నిజమైన మైత్రి అయితే, ఎందుకు ట్రంప్ భారత్‌ను “టారిఫ్ కింగ్” అంటూ ఆరోపించాలి?

ట్రంప్ చేసిన అన్యాయం…

H1B వీసాలపై ఆంక్షలు, ట్రంప్ పాలనలో భారత యువత కలలు దెబ్బతిన్నాయి,ఐటీ ఉద్యోగులపై నిబంధనలు కఠినతరం,వీసా ప్రాసెసింగ్ స్లో, గ్రీన్‌కార్డ్ వేయడంలో జాప్యం, COVID కారణంగా వలస నిషేధాలు,ఈ నయమైన వలస విధానాల వల్ల 5 లక్షల మందికి పైగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ట్రంప్ కుటుంబానికి భారత రియల్ ఎస్టేట్ రంగంలో బలమైన వ్యాపార ఆధారం ఉంది, ట్రంప్ టవర్స్ (పూణే, ముంబై, గూర్గావ్) భారత మార్కెట్లో బ్రాండ్ ప్రమోషన్ కోసం ట్రంప్ వ్యక్తిగతంగా భారత్‌లో ప్రసంగాలు, GSP నుండి తొలగింపు భారత దేశానికి అమెరికా ఇచ్చే ప్రత్యేక వాణిజ్య హక్కులను తొలగించారు. దాదాపు $6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం.అధిక సుంకాలు స్టీల్, అల్యూమినియం, మెడికల్ గూడ్స్‌పై దిగుమతులపై సుంకాలు పెంచడం వల్ల భారత వ్యాపార రంగం కుదేలైంది.మేడి–ఇన్–ఇండియా అడ్డంకులు మోడీ ప్రభుత్వ అభివృద్ధికి ఎదురుగానూ విధానాలు. అమెరికా కంపెనీలపై ఆధారపడే విధంగా ఒత్తిడి.ఈ చర్యలన్నీ మిత్రుని చర్యలా అనిపిస్తాయా? అయితే – దేశానికి ప్రయోజనం కాకుండా, వ్యక్తిగత ప్రయోజనం కోసం భారత నేతలతో స్నేహం కొనసాగించడం వ్యాపార రాజకీయం అనే విమర్శలు రావడానికి గల ప్రధాన కారణం.

వ్యూహాత్మక శత్రువు..

ట్రంప్ అవసరమైతే మిత్రుని ముద్దాడతాడు, లాభం కనిపించకపోతే మిత్రుని మోసం చేస్తాడు, భారత్‌పై ప్రేమ చూపించాడనుకునే కొందరికి — వాస్తవాలు తలకిందులుగా ఉన్నాయి,కాబట్టి ట్రంప్ – భారత్‌కు మిత్రుడి రూపంలో వచ్చిన వ్యూహాత్మక రాజకీయ శత్రువు.వివేకవంతమైన ప్రజలు, పాలకులు – ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.మన ప్రభుత్వాలు వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి వ్యూహాత్మక మిత్రత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, దేశ ప్రయోజనాలు పణంగా పెట్టినట్లవుతుంది. మిత్రునిగా భావించిన ట్రంప్ చేతుల మీద వేసిన రాయి భుజాన పడినట్లవుతుంది.మిత్రుడి వేషంలో ఉండే శత్రువు అత్యంత ప్రమాదకరుడు. ట్రంప్ మైత్రి మాటలు చెబుతారు, కానీ చర్యల ద్వారా భారత్‌ను దెబ్బతీయగలరు. అది భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా, సామాజికంగా — ఒక అణు బాంబు లాంటిదే.

ఎలా స్పందించాలి?

స్వార్ధాన్ని గుర్తించాలి , ట్రంప్ తాత్కాలిక మద్దతునే ఇస్తాడు. దీర్ఘకాలిక మైత్రి ఆశించకూడదు. ద్వైపాక్షికంగా కాకుండా బహుళపక్షంగా వ్యవహరించాలి: అమెరికా మాత్రమే కాకుండా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, గల్ఫ్ దేశాల‌తో సంబంధాలు పటిష్టం చేయాలి. ఆత్మనిర్భరతకు ప్రాధాన్యం , అమెరికా మీద ఆధారపడే దాని బదులు స్వదేశీ రక్షణ, ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో స్వయం సరిపడే స్థాయికి చేరుకోవాలి.
పాకిస్తాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ట్రంప్ పాలనలో పాకిస్తాన్‌ను పూర్తిగా పక్కన పెట్టడు. కావున, భారత్‌ను అనుసంధానించుకునే పద్ధతిలో వ్యవహరించాలి. డిప్లమసీపై దృష్టి , ట్రంప్ unpredictable లీడర్. ఎవరి మాట ఎలా మారుతుందో అర్థంకాదు. అందుకే డిప్లమసీ ద్వారా పొలిటికల్ బ్యాలెన్స్‌ను కొనసాగించాలి. భారత్ మితవ్యయంతో, సమతుల్యతతో, దూరదృష్టితో వ్యవహరించాలి. మిత్రుడిగా చూడాలి, కానీ మోసపోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ ఉండవు. మన ప్రయోజనాలు ఎక్కడ ఉండాయో, అక్కడే మనం ఉండాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img