డొనాల్డ్ ట్రంప్ అనే పేరు వినగానే ఒక వ్యతిరేకత, ఒక వివాదం గుర్తుకొస్తుంది. రాజకీయాల్లో తొలిసారి అడుగుపెట్టి ప్రపంచ రాజకీయాలను సుడిగాలిలా మార్చిన ఈ నాయకుడు వాణిజ్య విధానాల్లో ఎంతో ఆకస్మిక మార్పులు చేశాడు. అందులోనే ముఖ్యమైనది – సుంకాల విధానం. ప్రపంచీకరణ వైపు వెళుతున్న అమెరికాను తిరిగి వాణిజ్య జాతీయవాద దిశకు మళ్ళించిన ఈ నిర్ణయాన్ని బాధ్యతాయుతమైన దేశ హితంగా చూడాలా? లేక మూర్ఖత్వపు పరాకాష్టగా భావించాలా? ఇది చదివాక మీరే నిర్ణయించండి.
“అమెరికా ఫస్ట్” సిద్ధాంతం:
2017లో అధ్యక్ష పదవిలోకి వచ్చాక ట్రంప్, “America First” అనే సిద్ధాంతాన్ని ప్రోత్సహించారు. దీని నిధర్శనం,అమెరికన్ ఉద్యోగాల పరిరక్షణ, స్థానిక పరిశ్రమలకు ప్రాధాన్యత, విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు, ఈ విధానం ద్వారా అమెరికా అభివృద్ధికి తిరిగి శక్తిని అందిస్తానన్న నమ్మకం ట్రంప్ కలిగించడానికి ప్రయత్నించారు.2025లో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్, తన తొలి పాలనలోనే పునాది వేసిన సుంకాల విధానాన్ని మరింత తీవ్రంగా కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 70 దేశాలపై కొత్తగా భారీ సుంకాలు విధించడమే కాదు, ఆయా చర్యలు రాజకీయ, భద్రతా, ఆర్థిక కారణాల ఆధారంగా తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.
తాజా సుంకాల విధింపు –
🗓️ 2025 జూలై 31న ట్రంప్ ఒక కీలక ఆదేశంపై సంతకం చేశారు , “67 దేశాల దిగుమతులపై 10% నుండి 41% వరకు సుంకాలు విధిస్తున్నాను. ఇది ఆగస్ట్ 7, 2025 నుండి అమలులోకి వస్తుంది. భారత్ పై 25% శాతం సుంకాల విధింపు కారణం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం,, చైనా 10% → 20% ఫెంటనైల్ డ్రగ్ స్మగ్లింగ్, జాతీయ భద్రత, బ్రెజిల్ పై 50% శాతం సుంకాల విధింపు వేనేజుయెలా చమురుతో వాణిజ్యం వల్ల, కెనడాపై 35% శాతం సుంకాల విధింపు వ్యాపార అసమతుల్యత, వేనేజుయెలా చమురు కొనుగోలు చేసే దేశాలు 25% అమెరికా ఆంక్షలను అతిక్రమించడం లాంటివి.
ట్రంప్ ప్రధాన లక్ష్యాలు:
రాష్ట్ర భద్రత రక్షణ పేరుతో సుంకాలే ఆయుధాలుగా మారాయి. ఆర్థిక బలప్రదర్శన – రాజకీయ, వ్యాపార ఒత్తిళ్లు సృష్టించేందుకు, చైనా, రష్యా, వేనేజుయెలా లాంటి దేశాలపై నియంత్రణ పునఃస్ధాపన. ఉద్యోగాలు తిరిగి అమెరికాలోకి తెచ్చే ప్రయత్నం – కానీ ఇది వాస్తవంలో సాధ్యమవుతుందా? అనేది కాలమే సమాధానం చెబుతుంది.
భారత్‌పై ప్రభావం….
– రష్యా చమురు కొనుగోలు కారణంగా భారత్ దేశం పైన 25% సుంకం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇండియా-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. భారత ఐటీ, మెడిసిన్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై ఈ సుంకాలు పెద్ద సమస్యగా మారే సూచనలు ఉన్నాయి. ఆర్థిక నిపుణులు ప్రకారము .”ఇది జాతీయవాదంలో డబ్బుతో చేసే రాజకీయాలు.” – దీని వల్ల అమెరికా వినియోగదారుడే ఎక్కువ నష్టపోతాడు.” Brookings Institution, Generalized System of Preferences (GSP) రద్దు చేశారు. ఈ విధానాలు బలహీన దేశాలకు తీవ్రమైన భారంగా మారతాయి.” – IMF, WTO, సంస్థలు కూడ ప్రెసిడెంట్ ట్రంప్ ను హెచ్చరిస్తున్నాయి. అయితే ఆత్మనిర్భర్ భారత్ వేదికగా ఇండియా సొంత తయారీకి ఇది ఓ అవకాశం కాగలదు.
అమెరికాపై ఎఫెక్ట్ …
ద్రవ్యోల్బణం పెరుగుతోంది – అమెరికన్ కుటుంబానికి సగటున $2,400 అదనపు ఖర్చు.స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి – 2025 ఆగస్ట్ 1న S&P 500 → 1.6% తగ్గింది, Nasdaq → 2.2%. వాణిజ్య లోటు తగ్గినా, తలసరి వినియోగానికి ధరలు పెరిగాయి. సాధారణ కుటుంబాలపై భారంగా మారిన వినియోగదారులు ధరల పెరుగుదల, చిన్న & మధ్య పరిశ్రమలు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల లాభాల క్షీణత, రైతులు చైనా మార్కెట్ పోవడం వల్ల దిగుమతి తగ్గిపోయింది, అంతర్జాతీయ సంబంధాలు మిత్రదేశాల్లో ఆగ్రహం, స్టాక్ మార్కెట్లు అస్థిరత, నష్టాలు, భారత్ వంటి దేశాలు తాము ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై అమెరికా మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం.చైనా, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలు ప్రతిస్పందన సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. WTO వ్యతిరేకంగా చర్యలు – అనేక దేశాలు అమెరికాను వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించిందిగా ఆరోపిస్తున్నాయి.గ్లోబల్ ఎకానమీని అర్థం చేసుకోని చర్య, అమెరికాకు నష్టమే ఎక్కువ, లాభం తక్కువ….
ఇది మూర్ఖత్వమా?
సూత్రంగా చూస్తే — కచ్చితంగా “మూర్ఖత్వం” అని తేల్చేయడం తక్కువ విశ్లేషణతో కూడిన తీర్పు అవుతుంది. కానీ ఆర్థిక నిపుణుల, వాణిజ్య నిపుణుల దృష్టిలో, ట్రంప్ విధించిన సుంకాలు అలంకారికంగా శక్తివంతంగా కనిపించినా, ఆర్థిక ఫలితాల పరంగా నష్టదాయకంగా మిగిలాయి. IMF, WTO, Harvard, Brookings Institution వంటి వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,…ట్రంప్ సుంకాల విధానం” — ఒక జాతీయవాద ఆధారిత ఆర్థిక వ్యూహం, కానీ ప్రపంచీకరణ దశలో ఉన్న అమెరికా వంటి దేశానికి దీన్ని పూత మట్టిగా విధించడం మూర్ఖత్వమే అని అనేక ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీన్ని మేధో హీనతగా కాకుండా, తీవ్ర జాతీయత ఆధారిత పొలిటికల్ స్టంట్గా చూడవ
స్వార్థం వదిలి…..
డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానం ఆర్థిక జాతీయతను పునః స్థాపించాలనే ప్రయత్నం. కానీ ప్రపంచీకరణ పరంగా ఆచరణాత్మకంగా అసాధ్యమైన, తనకే నష్టాన్ని తెచ్చే వ్యూహంగా మారింది. పైగా ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ వాణిజ్య చరిత్రలో ప్రొటెక్షనిజం తిరిగి పుట్టినదానికి నిదర్శనం. అతను గ్లోబల్ ట్రేడ్‌పై రాజకీయ ఒత్తిడి ప్రదర్శన చేసేందుకు సుంకాలను ఒక ఆయుధంగా మలచారు. అయితే దీని ఫలితంగా, అమెరికా ప్రజలు అధిక ధరలు చెల్లిస్తున్నారు,దేశీయ పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశ్యం ఉన్నా, ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై నమ్మకాన్ని దిగజార్చింది.అంతిమంగా,ప్రపంచం మల్టీలాటరల్ టూల్స్ (WTO, ట్రీటీలు) వైపు వెళుతుంటే, ట్రంప్ యుగం మాత్రం స్వార్థ కేంద్రిత “టారిఫ్ నేషనలిజం” వైపు మళ్లినది, అంతేకాదు విదేశీ దేశాలపై వ్యాపార భయం, అస్థిరత పెరుగుతోంది, మరియు ఆర్థిక సంబంధాలు ప్రమాదంలో పడుతున్నాయి.ఈ విధానానికి ఫలితాలు తక్షణమే కనిపించకపోయినా, దీర్ఘకాలంలో ఇది అమెరికా మిత్ర దేశాలను దూరం చేసే అవకాశముంది. అందుకే ట్రంప్ తన మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని మరిచి మెజారిటీ ప్రజల జీవితాలతో ఆడుకునే స్వంత రాజకీయ ప్రయోజనాలను విడనాడి మానవత హృదయంతో విరమించుకొని ముందుకెళ్లుతారని ఆశిద్దాం.
డాక్టర్. కేశవులు భాషవత్తిని. ఎండి, సైకియాట్రీ.
చైర్మన్ : తెలంగాణ మేధావుల సంఘం.
8501061659.