తెలంగాణ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి . హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ఉన్న ఈటల రాజేందర్ బిజెపికి రాజీనామా చేసి బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ప్రముఖ బీసీ మేధావి బండి సదానందం విజ్ఞప్తి చేస్తున్నారు రాజేందర్ కు రాష్ట్ర బిజెపికి నాయకత్వం వహించగల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవకాశం ఇవ్వకపోవడం దారుణమైన విషయం అని సదానందం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ కు జరిగిన అవమానాన్ని బీసీలు ఆత్మగౌరవ సమస్యగా పరిగణిస్తున్నామని సదానందం అన్నారు ఇప్పటికైనా ఈటల రాజేందర్ బిసి ఎస్సి ఎస్టి మైనార్టీలను కలుపుకొని బలమైన బహుజన ఉద్యమానికి పునాదులు వేసి సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా బిజెపిలో ఉన్న బహుజన నేతలు అంతా ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీ రాజ్యం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు