Saturday, March 15, 2025

ఈ మూడు కులాలకు మంత్రి పదవులు రాకపోతే కాంగ్రెస్ కు భారీ నష్టం …

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. పార్టీకి కొత్త సారధి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మొన్నటి వరకు జోడు పదవులతో బిజీబిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ గా మహేశ్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి రేవంత్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మందితో కేబినెట్ ఉంది. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటుదక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు, జిల్లాలు, బలాలు ఇలా ఎవరికివారు లెక్కలు వేసుకొని రేవంత్ కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో హైదరాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవరూ లేరు. ఈసారి ఈ జిల్లాల నేతలకు చాన్స్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు.

అయితే ….. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జోరు నడుస్తున్నది. బీసీలకు అన్ని రంగాలలో తీవ్రమైన అన్యా జరుగుతున్నదని, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు మనకు సాధ్యం కాదనే భావన బీసీ వర్గాలలో ఉంది,ముఖ్యంగా యువతలో బీసీ నినాదం పట్ల బీసీ ఐక్యత పట్ల బీసీల రాజ్యాధికారత పట్ల ఆకాంక్ష ఎక్కువవుతున్నది రాజకీయ అన్ని రకాల రిజర్వేషన్లను బీసీలు కోల్పోతున్నారని 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం కూడా రిజర్వేషన్ అందడం లేదని భావన విద్యార్థుల్లో నిరుద్యోగులు తీవ్రంగా ఉంది,రాష్ట్రంలో బీసీ జోరు వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయి ఆస్కారం ఏర్పడ్డది . ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీసీ కులాలలో ప్రధానంగా ముదిరాజులు మున్నూరు కాపులు పద్మశాలీలు పెద్ద ఎత్తున బిజెపికి ఓటు వేయడంతోనే కాంగ్రెస్ చాలా చోట్ల నష్టపోవాల్సి వచ్చింది ఫలితంగానే బిజెపి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే, ఈ కులాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగే పరిస్థితి ఉంది, అయితే ఇప్పుడున్న ఆరు సీట్లలో నాలుగు పైగా బీసీలకు ఇవ్వకపోతే. బీసీల నుంచి ప్రతిఘటన ఎదురయ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఉత్తర తెలంగాణ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కనీసం రెండు మంత్రి పదవులు, ముదిరాజ్ నుంచి ఒకరికి , యాదవ వర్గం నుంచి ఒకరికి ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు కులస్థుల హవాను తట్టుకోవాలంటే అదే వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఉంటున్న ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే భారీగా నష్టం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముదిరాజ్ వర్గం నుంచి శ్రీహరికి, యాదవ వర్గం నుంచి ఒకరికి ఇవ్వాల్సింది, బీసీలకు కనీసము నాలుగు సీట్లు కేటాయించ కపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి భారీ వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img