కూర్చున్న చోటు నుంచి కదల్లేని బద్ధకం, నాలుగు అడుగులు వేస్తే చాలు నీరసం… ఇవన్నీ అనారోగ్య సమస్యలు అనుకునేరు. వ్యాయమం లేకపోవడం వల్ల కనిపించే ప్రాథమిక లక్షణాలు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా దీర్ఘకాలం పాటు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రోగాలెన్నో చుట్టుముడతాయి.
కూర్చున్న చోటు నుంచి కదల్లేని బద్ధకం, నాలుగు అడుగులు వేస్తే చాలు నీరసం… ఇవన్నీ అనారోగ్య సమస్యలు అనుకునేరు. వ్యాయమం లేకపోవడం వల్ల కనిపించే ప్రాథమిక లక్షణాలు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా దీర్ఘకాలం పాటు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రోగాలెన్నో చుట్టుముడతాయి. ఈ పరిస్థితి రాకూడదంటే మహిళల్ని మేలుకోమంటున్నాయి. అధ్యయనాలు. ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అప్పుడే, ఊబకాయం, నెలసరి, మెనోపాజ్ చిక్కులు, ఆస్టియోపోరోసిస్ ముప్పు, భావోద్వేగాల వల్ల కలిగే చికాకులు…ఇలా ఎన్నింటినో తప్పించుకోవచ్చు మరి. దీనివల్ల మీరు ఆరోగ్యంగానే కాదు… చురుగ్గానూ ఉండగలరు. అమెరికాకు చెందిన ‘ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ అధ్యయనం ప్రకారం వారంలో కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్స్ చేయాలట. అంత సమయం కేటాయించలేం అంటారా? కనీసం 75 నిమిషాల పాటు వేగంగా ఏరోబిక్ వ్యాయామం చేయాలి. ఇంత తెలిశాక ఊరకే ఉంటే ఎలా? కసరత్తులు మొదలు పెట్టండి ప్లీజ్.
Dr.keshavulu. MD. psy. Osm. Chief Neuro-psychiatrist.