ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యమే అతి పెద్ద లైఫ్‌సేవర్ అని అంటారు.. అయితే ఇటీవల భారతీయుల ఆరోగ్యానికి సంబంధించిన ఒక సంచలన నివేదిక వెలువడింది. ఈ నివేదికలో భారతదేశంలోని స్త్రీలు మాత్రమే కాదు పురుషులకు కూడా 3 ముఖ్యమైన పోషకాల కొరత ఉందని చూపిస్తుంది. భారతదేశంలో స్త్రీలలో హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లు తరచుగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా పురుషులకు కూడా కొన్ని ముఖ్యమైన విటమిన్లలో లోపంతో ఇబ్బంది పడుతున్నారని నివేదికలో వెల్లడైంది.
లోపమున్న విటమిన్లు ఇవ్వే..
నివేదిక ప్రకారం భారతదేశంలోని పురుషులు , స్త్రీలలో ఐరెన్, కాల్షియం, ఫోలేట్ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనం కేవలం భారత దేశంలో మాత్రమే కాదు 185 దేశాల్లోనూ అధ్యయనం చేసింది. ఆయా దేశాల్లోని ప్రజలకు 15 అవసరమైన సూక్ష్మపోషకాల లోపం ఉన్నట్లు తేలింది.
లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల్లో అయోడిన్ లోపం ఎక్కువగాఉంది. మహిళలు తక్కువ అయోడిన్ తీసుకుంటారు. అదే సమయంలో పురుషులు మహిళల కంటే తక్కువ జింక్ తీసుకుంటారని తెలుస్తోంది.
Dr keshavulu MD psy Osm, Chief Neuro-psychiatrist. Hyderabad & Nizamabad.