ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ సిద్ధమైనపద్దతులతో ఎలా కాపాడు కావాలో తెలుసుకోండి.
వాల్‌నట్‌లను తినండి: ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
ఆలివ్ నూనె : మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. కావున అల్పాహారం ఆలివ్ నూనెతో తయారు చేసుకుని తినండి.
అవిసె గింజలు : అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
ఆరెంజ్ జ్యూస్: ఉదయం పూట ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. 750 మి.లీ నారింజ రసాన్ని ఉదయం పూట 4 వారాల పాటు నిరంతరం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
మార్నింగ్ వాక్: మార్నింగ్ వాక్ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను 5 శాతం పెంచుతుంది.
Dr keshavulu MD psy 0sm, Chief Neuro - psychiatrist. Hyderabad & Nizamabad.