పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కొలకత్తాలోని ప్రభుత్వ ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థి పై అర్ధరాత్రి మానవ మృగాలు లైంగిక దాడి చేసి ఆపై చంపివేయడం బాధాకరమని, ఈ సంఘటన మనవ జాతి నైతిక సంబంధాల క్షీణతకు పరాకాష్ట అని, ఈ అనైతిక ప్రవర్తనకు కారకులైన వారిని వారాంతంలో విచారణ చేసి ఉరితీయాలని, అలా చేయడం మీకు చేతకాకపోతే మాకు చెప్పండి, తల్లితండ్రులుగా మేమే శిక్ష ఖరారు చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు అల్టిమేటమిచ్చారు. ఈ విషయాన్ని X ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలిపారు.
దేశంలో ఎన్ని చట్టాలు చేసినను, మరెన్నో శిక్షలు విధించినను మానవ మృగాల్లో మార్పు రాలేకకపోతున్నదని, ఆడబిడ్డల తల్లిదండ్రులుగా మా బిడ్డలు దూరప్రాంతాలు చదువుతున్నన్ని రోజులు సగం రాత్రి నిద్రలు పోతున్నామని, ఇలాంటి ఘటనలను ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని, ఆడబిడ్డల కన్న తల్లిదండ్రులు క్షణమొకయుగంగా భయంతో బతుకుతున్నారని, గాంధీజీ చెప్పినట్టు అర్ధరాత్రి ఒంటరిగా ఆడది నడవడమేమో కానీ…. కనీసం అర్ధరాత్రి జీవించడం కూడా కష్టమేనని ఈ సంఘటన రుజువు చేసిందని, స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు జరిగిన ఆడపిల్లలకు రక్షణ లేదంటే దేశంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని, వైద్య విద్యార్థిని తండ్రిగా ఆ బిడ్డల పడుతున్న బాధేంటో తెలుసని డాక్టర్ కేశవులు చెప్పారు .
ప్రభుత్వాలు ఆడబిడ్డలకు రక్షణ కల్పించకపోతే ఎవరు కల్పించుతారో ఆలోచించాలన్నారు, న్యాయవ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయని.. డబ్బున్న, బలమున్న వాళ్లే రాజ్యమేలుతున్నారని, వెనుక ముందు లేని అమాయక ప్రజలు బలైపోతున్నారని మానసిక వైద్య నిపుణులు కూడ ఐనా డాక్టర్ కేశవులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొదటి సంఘటన కాదు.. చివరి సంఘటన కాదు.. ఎన్నో సంఘటనలు చూసుకుంటూ బతుకుతున్నామని అందుకే ప్రభుత్వాలకు చేతకాకపోతేచెప్పండి ..ఇక తల్లిదండ్రులుగా మా పిల్లల మేమే రక్షించుకుంటాం… మా పిల్లల కాపాడుకోవడం మీకు చేతకాకపోతే మేము కాక ఇంకెవరూ కాపాడుకుంటారు మేమే కాపాడుకుంటాం అవసరం అయితే ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలు ఏ శిక్షలు వేధించిన భయపడబోమని మా పిల్లను కాపాడుకుంటామని డాక్టర్ కేశవులు ఆవేదనతో చెప్పారు.