కొన్ని చిన్న అలవాట్లు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం.. అవును, మీరు సరిగ్గానే విన్నారు.. మెట్లు ఎక్కడం వల్ల అది మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో పాటు కొన్ని చిన్న సులభ మార్గాల ద్వారా కూడ నయం తీసుకోవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.. అందులో గుండెపోటును నివారించడానికి మార్గం .. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం ఉత్తమమని దీనిద్వారా గుండె సిరలు బలంగా మారడం ప్రారంభమవుతుందని,. ప్రతిరోజూ 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ. జిమ్‌కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి మీకు సమయం దొరకకపోయినా, భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది. ఇలాంటి సులభమైన మార్గాల్లో మీ హృదయాన్ని కూడా పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని పరిశోధనలు తెలిపాయి.
Dr keshavulu MD psy Osm .. Chief Neuro-psychiatrist
,