తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీ కులాలు తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరి, సమాన గౌరవంతో జీవించవచ్చనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చి దశాబ్దం దాటినా తర్వాత కూడ స్వరాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు, ఎంబీసీలు, సంచార జాతుల వారి జీవితాల్లో ఏమాత్రం వెలుగులు చూడలేక పోతున్నాం. అధికారంలో అన్ని కులాలకు భాగస్వామ్యం లభిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక స్వావలంబన లభిస్తుందని తమ ఉన్నత విద్య, ఉద్యోగం, సామాజిక హక్కులకు పూర్తి స్థాయి భరోసా, రక్షణ ఉంటుందనుకున్న బీసీ కులాలకు అదీ నుంచీ అవమానాలు వివక్షలే కొనసాగుతున్నాయి. కొన్ని సంక్షేమపథకాలు, విద్య, ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు, కొందరు బీసీ నేతలకు అప్రధానమైన మంత్రులకు కేటాయించటం లాంటి చర్యలు బిసి ల వెనుక బాటు తనాన్ని కానీ , సమస్యలను కానీ ఏమాత్రం పరిష్కరించలేక పోతున్నాయి. అయితే కులగణన లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారనే కథనాలు చూసి పత్రికలో బీసీ వర్గాలు అగ్గి గుగ్గిలమైపోతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కులగణనపై స్పష్టమైన హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనూ ఈ ప్రక్రియను పూర్తిచేస్తామంటూ భరోసా ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి మార్చి 15న జీవో కూడ చేసినప్పటికీ ఉలుకు పలుకులేనె లేదు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామంటూ రాహుల్ గాంధీ హామీ ఇవ్వడంతోపాటు తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జొరుగా ప్రచారం చేసింది కూడ, తీరా చూస్తే తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం పూర్తిగా వ్యతిరేకం.
రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు పసిగట్టిన కొందరు బీసీ నాయకులు బీసీల భవిష్యత్తు కొరకు ఒక రాజకీయ పార్టీ నిర్మించాలని ఆలోచనలతో ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. దీని వెనుక అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఆ అధికార పార్టీ నాయకుడే కొన్నాళ్ళ తరువాత, అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి బీసీ రాజకీయ పార్టీకి నాయకత్వం వహించి పోరాడుతారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా పార్టీ ఏర్పాటు మాత్రం ఖాయం , నాయకుడు ఎవరన్నది కొద్ది రోజుల్లో తెలియబోతుంది…