ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తారీఖు రానే వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది ఎన్నికల ఫలితాల విషయంలో ఒత్తిడి గురవుతున్నారు , ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
© ఎన్నికల ఫలితాలు ఉన్నాయని తొందరపడి లేవవద్దు.© రోజువారి విధంగానే రొటీన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి.© ఉదయం పూట సులువుగా అరిగే ఆల్పహారాలు తీసుకోండి.© పరగడుపున వేసుకునే మాత్రలు యధావిధిగా వేసుకోండి.© అల్పాహారం తర్వాత రోజు వేసుకునే బీపీ మాత్రను వేసుకోండి.© ఎన్నికల ఫలితాలు చూడడానికి టీవీ ఆన్ చేసి తక్కువ వాల్యూం తో వీక్షించండి…
.© ఒక మామూలు చల్లని మంచినీరు బాటిల్ దగ్గర పెట్టుకోవాలి.© ఎందుకైనా మంచిదని T.Sorbitrate అందుబాటులో ఉంచుకోవాలి.© ఇష్టమైన స్నెహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య నే కూర్చోండి.© ఇంటిలో కూలరు గానీ ఏ సీ గానీ ఆన్ లో ఉంచుకోనీ ప్రశాంతంగా కూర్చొండి.
© మనకు నచ్చిన అభ్యర్థి లేదా పార్టీ ఈసారి ఓడిపోయినను. వచ్చేసారీ గెలుస్తుందనే ఆశతో ప్రశాంతంగా ఉండండి.© మన అభ్యర్థి లేదా పార్టీ గెలుస్తున్నట్లు తెలిసినను అతి సంతోష పడకండి..© మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి.నిండు గా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.
© మనకు ఇష్టం లేని వారు గెలవొచ్చు, నచ్చని ప్రభుత్వం రావచ్చు…అని ముందే… అనేసుకుంటే మనకు పెద్దగా నష్టమే ఉండదు కదా!
© పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా మనవాళ్లే కదా అని మనసులో అనుకొని… భోజనం చేసి రాత్రి యధావిధిగా పండుకోండి.
నోట్ ;
ఈ ప్రపంచం ఒక మాయ…. అంటూ.. …. స్మరిస్తూ……………………….. జరిగినది… జరుగుతున్నది…. జరగబోయే దాని గురించి అతిగా ఆలోచించకండి..
Dr.keshavulu. MD.psy.osm.