మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలువడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. ఇరు పార్టీలకు చాలా ప్రాముఖ్యం గల ఎన్నిక కూడ…సిఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా కావడం, పైగా 200 ఓట్ల తేడాతో గెలుస్తామని చెప్పడం తెలిసిందే… మొత్తంగా బి ఆర్ఎస్ పని ఖతం అనీ … ఇక కోలుకోవడం అసాధ్యమని.. పోటీ చేయడానికి ఎవరు రాని నేపథ్యం లో బి ఆర్ఎస్ గెలవడం కాంగ్రెస్ ను షాక్ గురిచేస్తుంది..
అయితే అధికారంలో ఉండి అచేతనవస్థలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీకి ఇది కచ్చితంగా ఊపిరి పోయడమే, ప్రజలలో బి.ఆర్.ఎస్ పార్టీ ఖతం కాలేదన్న సంకేతాలు కూడ వస్తాయి. ప్రస్తుత మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపుకు అసలు కారణం వేరే ఉంది… ఈ విజయానికి కారణం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పై ఉన్న అభిమానం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్లక్ష్యత, అతివిశ్వాసము గెలిచి తీరుతాం..లే అనే భ్రమలో ఉండిపోయారు.. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న .. కసి గెలిచి తీరాలనే . పట్టుదల లేకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం.…
ఫలితాలు తెలుసుకున్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు, పట్టున్న జిల్లాలో ఫలితం ఇలా ఎలా వచ్చిందని ? అసలు మీరు పని చేశారా లేదా? పార్టీ ముఖ్యమనే విషయం మర్చిపోవద్దు..ఎంతటి వారైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడాల్సిందే .పార్టీ గెలుపు పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు… ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కావాలి … అంటూ సీరియస్ ఆయినట్లు తెలుస్తుంది…