Sunday, March 9, 2025

కర్ణాటకలో ఏకనాథ్ షిండే ఎవరు ! కాంగ్రెస్ సర్కారుకు గండం నిజమేనా ?

ఏక్‌నాథ్ షిండే.. . ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. మహారాష్ట్ర ఎపిసోడ్ తరువాత అనేక రాష్ట్రాల్లో ఈ పేరు పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా పాపుల, ర్ఇప్పుడు..కర్నాటక సర్కార్ ని పడగొట్టేందుకు ‘ఆపరేషన్‌ నాథ్‌’ వ్యూహం రెడీ అయ్యిందా… ఎందుకంటే సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రే ఈ హింట్ ఇవ్వడం కర్నాటక రాష్ట్రంలో కలవరం మొదలైంది.

10 రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏక్‌నాథ్ షిండే.. . కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మహారాష్ట్రలో స్కెచ్ రెడీ అవుతోందని .రాష్ట్ర బీజేపీ నాయకులు తనను సాయం కోరినట్లు షిండే అనడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఇటీవల చేసిన కామెంట్లపై… కర్నాటక సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఇది నీ రాష్ట్రం కాదు.. నా ఇలాఖా అంటూ సెటైర్ వేశారు. మహారాష్ట్రలో చేసినట్టు కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌ ఇంపాజిబుల్ అన్నారు. గతంలో తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలైంది.. ఈ విషయంలో వాళ్లు ఫెయిల్ అవుతూనే ఉన్నారని సెటైర్ వేశారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరన్నారు. అది కేవలం పగటికల అని కామెంట్ చేశారు.

కర్నాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 136 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 66 మంది, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నుంచి 19 మంది. ప్రస్తుతం రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. రెండు పార్టీల సభ్యులు కలిస్తే ఆ సంఖ్య 85. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే తప్ప.. ప్రభుత్వం పడిపోవడం సాధ్యంకాదు

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img