Monday, March 10, 2025

 మీకు షుగర్ ఉందా..? హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ… ఈ జాగ్రతలు కంపల్సరీ…

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మీకు షుగర్ ఉన్నట్లయితే బి అలర్ట్ షుగర్ లేని వారి కంటే ఉన్నవారికి గుండెపోటు జబ్బులు రెండు రెట్లు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని జీవన విధానాలను మార్చుకున్నట్లుయితే కచ్చితంగా గుండెపోటు ప్రమాదం నుంచి దూరం కావచ్చు .

షుగర్ లెవెల్ నియంత్రణ చాలా ముఖ్యం ;

డయాబెటిస్‌ అదుపులో ఉంచడానికి,  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ముఖ్యం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లను తినండి.

హెచ్డిఎల్ పెరిగే ఆహార పదార్థాలు తినండి;

పూర్తిగా, ప్రాసెస్ చేయని ఆహారము .చేపలు, పౌల్ట్రీ, బీన్స్, టోఫు వంటి లీన్ ప్రోటీన్లను, ఆలివ్ ఆయిల్, అవకాడోస్, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి.

క్రమం తప్పకుండా వ్యాయామం;

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వారానికి కనీసం 150 నిమిషాల సాధారణ ఏరోబిక్ యాక్టివిటీని చేయండి. మీ కండరాల బలం, మొత్తం ఫిట్‌నెస్‌ని మెరుగుపరచడానికి మీ దినచర్యకు వ్యాయామాన్ని జోడించండి.

ఓవర్ వెయిట్ అసలే వద్దు;

బాగా వెయిట్ ఉంటే తగ్గేందుకు ప్రయత్నించండి. మీ హార్ట్ బాగుండాలంటే కొవ్వు తగ్గాల్సిందే. అధిక బరువు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

బీపి కంట్రోల్ లో ఉండాలి;

మధుమేహం ఉన్నవారిలో అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం. ఇవి గుండె జబ్బుల ప్రమాదానికి దోహదం చేస్తాయి. మందులు, తక్కువ సోడియం ఆహారం తీసుకోండి.

స్ట్రెస్ కు దూరంగా ఉండండి ;

చాలామంది అనవసరపు ఒత్తిడులకు గురవుతున్నారు.దీంతో డయాబెటిస్.బిపి పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది .ఫలితంగా గుండెపోటు వచ్చే ఆస్కారము రెట్టింపుగా ఉంటుంది.

Dr.keshavulu.MD.psy.Osm. Chief Neuro-psychiatrist.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img