తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేందుకు ఓ మంత్రి కుట్ర చేస్తున్నాడని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి హరీశ్ రావు మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.”కోమటిరెడ్డి ఒక మనిషిని నా దగ్గరికి పంపించిండు. 22 మంది ఎమ్మెల్యేలల మద్దతు ఉంది. గవర్నమెంట్ పడగొడుదాం. నేనే ముఖ్యమంత్రి అయితా. అందుకు బీఆర్ఎస్ మద్దతు కావాలి.” అని రాయభారం పంపినట్టుగా పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాను కోమటిరెడ్డిని నమ్మలేదన్నారు.
కోమటిరెడ్డి ఓ పిచ్చొడని.. నమ్మకం లేదని.. రూం లోపల ఒకటి, రూం బయట ఒకటి మాట్లాడుతాడని. సర్కారును ప్రశ్నించమని ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, కోమటిరెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. అసెంబ్లీకి కూడా మద్యం సేవించి వస్తాడని.. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదంటూ మండిపడ్డారు.కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు కూడా ఈ విషయం చెప్పలేదనీ తెలిపారు.
హరీశ్రావును విమర్శించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాన్నమనీ. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒక్క మాటకి వంద మాటలు అంటామని, అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు.. మేము కేసిఆర్ సైనికులమని తస్మాత్ జాగ్రత్త అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవలం సంచలనం కొరకే ఇది చేశాడా ? లేదా ఇందులో నిజం ఎంత ఉందో భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది సుమా… ఒకవేళ ఆధారాలు లేకుండా చేసినట్లయితే సంచలనల పేరిట జరిగే వాటికి చర్యలు తీసుకోవాల్సిందే !
Courtacy..samayam newsapp.