Wednesday, March 12, 2025

మే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్… పనులుంటే ముందే చూసుకోండి…. ఇవే హాలిడేస్..

బ్యాంక్ సెలవులు

మే 1వ తేదీ: మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బ్యాంకులకు పబ్లిక్ హాలీడే ఉంటుంది. బెంగళూరు, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసే ఉంటాయి.

మే 5వ తేదీ: మే 5వ తేదీన ఆదివారం వస్తోంది. ఆ రోజు సాధారణ సెలవు ఉంటుంది.

మే 8వ తేదీ: ఈ రోజున రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉంది. ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

మే 10వ తేదీ: ఈ రోజున అక్షయ తృతీయ వస్తోంది. ఆ రోజు కూడా బ్యాంకులు ఉండవు. దేశంలోని చాలా ప్రాంతాలు సెలవులు ఉంటాయి.

మే 11వ తేదీ: ఇక మే 11వ తేదీన రెండో శనివారం వస్తోంది. దీంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.

మే 12వ తేదీ: ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవుతో మూసి ఉంటాయి.

మే 13న లోక్సభ ఎన్నికల సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.

మే 16వ తేదీ: మే 16వ తేదీన సిక్కిం స్టేట్ డే కారణంగా గ్యాంగ్టక్ ప్రాంతంలో బ్యాంకులు మూసి ఉంటాయి.

మే 19వ తేదీ: ఆ రోజున ఆదివారం. బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.

మే 23వ తేదీ: ఈ రోజు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్లోని చాలా చోట్ల బ్యాంకులు పని చేయవు.

మే 25వ తేదీ: నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. అలాగే త్రిపురలో పబ్లిక్ హాలీడే ఉంటుంది. దీంతో బ్యాంకులు అక్కడ బంద్ ఉంటాయి.

మే 26వ తేదీ: ఈ రోజున ఆదివారం వస్తోంది. కాబట్టి బ్యాంకులకు సాధారణ హాలీడే ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img