Saturday, March 15, 2025

కవితకు భారీ షాక్ , బెయిల్ తీర్పు వాయిదా ! బయటికి రావటం డౌటే ? మళ్లీ బాంబు పేల్చిన సుఖేష్…

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాగా.. ఆ వెంటనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అంతకంటే ముందే.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్టయిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం కవితను సీబీఐ అరెస్ట్ చేసి.. కస్టడీకి తీసుకుంది. కవిత విచారణ నడుస్తున్న సమయంలోనే.. కీలక నిదింతుడైన శరత్ చంద్ర గతంలో ఈడీ ముందు అప్రూవర్‌గా మారగా.. ఇప్పుడు సీబీఐ ముందు కూడా అప్రూవర్‌గా మారాడు. దీంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వేళ.. సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు.

ఈ కేసులో కీలక పాత్ర పోషించిన పెద్దలకు సంబంధించిన వాట్సప్‌ చాటింగులు తన దగ్గర చాలా ఉన్నాయని.. అందులో కొన్నింటిని మాత్రమే ఈ లేఖలో పేర్కొన్నట్టుగా సుఖేష్ బాంబు పేల్చారు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న స్క్రీన్‌షాట్‌లు దుమారం రేపుతున్నాయి.

తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసు పాలసీ కేసులో జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు కె.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మే 2వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఢిల్లీ కోర్టు 22-04 24  సోమవారం తెలిపింది. పనిలో పనిగా బెయిల్ రాకపోవడంతో భయపడుతున్న కవిత పెద్ద పెద్ద లాయర్ల కొరకు కుటుంబం పై ఒత్తిడి తెస్తుందని తేలిసింది .అయితే ఇటువంటి కేసులలో బెయిల్ రావడం కష్టమైనా పని అంటూ అదీ వృధా ప్రయాస అవుతుందని చెప్పినట్లు అభిజ్ఞ వర్గాల బోగట్ట.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img