Saturday, March 15, 2025

దేశం కోసం 5 నిమిషాలు ఉండక పొతే ఎలా ? సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ చంద్ర చూడ్ ఆవేదన…

( Telangana times Delhi ) ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ” My vote My voice – Mission లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది..

ఇందులో జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ ” ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు’ అని రాసుందని చంద్రచూడ్‌ తెలిపారు.

తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.ఐదు సంవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సమయం లేదా. ? ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్‌” అని చెప్పారు . ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1వరకు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు..

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img