‘మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేయడానికి కనీసం ప్రయత్నిస్తే చాలూ.. 48 గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నాను.. మా చర్యలు ఎప్పుడూ గౌరవప్రదంగా ఉంటాయి…. కానీ మాతో పెట్టుకుంటే మాత్రం కథ వేరేగా ఉంటుంది సుమా! అంటూ బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది..
అంతకు ముందు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి రెడీ గా ఉన్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కౌంటర్ గా మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజాకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, బీజేపీ నేత వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది? అంటూ మాట్లాడాడు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల్లోకి మారిన ఎమ్మెల్యేలను శిక్షించాలని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ప్రోత్సహిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మళ్ళీ మండిపడ్డాడు.
ఇద్దరి మధ్య జరుగుతున్న పోటా పోటీ మాటలకు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రాజకీయాలను ఇంత చిల్లరగా, అవహేళన గా మారడానికి కారణం ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు, బహుశ డబ్బుల ప్రభావం, అవకాశవాద రాజకీయాలు కారణాలు ఉండొచ్చు గాక.వాస్తవంగా కాంగ్రెస్ లోకి ఆయారం గయారం నేతలు మళ్ళీ మళ్ళీ చేర్చుకోవడం తో మొదటి నుంచి పార్టీ నీ నమ్ముకున్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు.