కే .కేశవరావు బి అర్ ఎస్ ను విడిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం వెనుక భారీ స్కెచ్ ఉందనే గుసగుసలు వినబడుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అత్యున్నత స్థాయిలో కే కేశవరావు ఉన్నమాట నగ్న సత్యం. కూతురుకు హైదరాబాద్ మేయర్ పదవి, కొడుకు కి కార్పొరేషన్ పదవి, తనకీ రాజ్యసభ పదవి, ఇలా ఒకే కుటుంబంలో అందరికీ పదవులు పొందిన కుటుంబము కెసిఆర్ కుటుంబం తర్వాత కేవలం కేశవరావుకు మాత్రమే చెందుతుంది. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం వెనుక మతలబు ఏమై ఉంటుందో ఊహించారా ? బిఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఉన్నత పొజిషన్లో ఉన్న కుటుంబము హఠాత్తు పార్టీ మార్పు వెనుక కెసిఆర్ వేసిన స్కెచ్ ఏమై ఉంటుందో నన్న విషయాన్ని విమర్శకులు సైతం గమనించలేకపోతున్నారు, కెసిఆర్ ఎప్పుడు ఏ వ్యూహాలు పన్నుతారో ఎవరికి అంతుపట్టదు, ప్రస్తుతము దేశవ్యాప్తంగా మోడీ వేవ్ ఉన్నది, ముఖ్యంగా చాలా రాష్ట్రాలలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపి పోరాటాలు చేస్తున్నది. కుటుంబ పాలన ను అంతం చేయకపోతే భారతదేశం ముందుకెళ్లదని నమ్మే వాళ్ళలో మోడీ ఒకరు, దేశాన్ని లూటీ చేస్తున్న ఈ ప్రాంతీయ పార్టీల కుటుంబ పాలన అంతం అందించడమే కోసం బిజెపి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అన్ని కుటుంబ పాలనలో ఉన్న నాయకులు విపరీత అవినీతి పాలనకు తెరదీచారు, కోట్లు పోగు చేసుకున్నారు, ఇమ్మడి బుబ్బడిగా జనాకర్ష పథకాల పేరుతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నారు.
ఈ కేంద్రంలో బిజెపి వచ్చినట్టయితే ఇక ప్రాంతీయ పార్టీలు మనుగడ కష్టమనే విషయం కెసిఆర్ కు తెలియందేం కాదు, కవిత అరెస్టుతో కేసిఆర్ కు మోడీ గారి తత్వము పూర్తిగా అర్థమయిపోయింది, ఇక మనల్ని మోడీ కాపాడడం కాదు గదా…కనీసం కటకటాలకు వెళ్ళకుండా నైనా ఉంచితే చాలు మహోప్రభువు అన్న రీతిలో వ్యూహాలు పన్నుతున్నారు. భవిష్యత్తులో తనతో సహా కుటుంబ సభ్యులందరూ జైలుపాలు కాక తప్పదని, ఈ పరిస్థితులలో బిజెపికి దగ్గర కావాలనుకున్నప్పటికీ, పట్టించుకోకపోవడం పైగా కవితను ఈడి . సిబిఐ అరెస్టులు చేయడంతో బీజేపి పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకుని, వెంటనే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో పనిచేసి, అతి దగ్గరగా మెదిలిన కే కేశవరావుతో మంత్రాలు ప్రారంభించాడు, రాజకీయ భవిష్యత్తు పై విపులంగా చర్చించాడు,
రేవంత్ రెడ్డి లేదా బిజెపి దారా ఏమైనా ఇబ్బందులు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ ,తన ఎమ్మెల్యేలు. ఎంపీ లు తన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కి బేషరతు గా సహకరిస్తామని, వీలైయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బి అర్ ఎస్ పార్టి ని పూర్తిగా విలీనం చేయడానికి కూడ వెనుకాడబోమని కేకే ద్వారా విషయాన చేరవేశాడు , అయితే కాంగ్రెస్ పెద్దలు కెసిఆర్ ను నమ్మలేదు. నమ్మకం కొరకే కేశవరావును కాంగ్రెస్ లోకి పంపించేశాడు. ఆ ఆ తర్వాత కడియం కూడా పంపించాడు, అప్పటి నుంచే నుంచే కెసిఆర్ పెద్దగా కాంగ్రెస్ పార్టీపై రాహుల్, సోనియా పై విమర్శనాస్త్రాలు చేయడం లేదు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బిజెపి పైనే ఎదురుదాడి చేస్తున్నారు ఏనాటికైనా జాతీయ పార్టీల మద్దతు లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ అసాధ్యమనే తత్వాన్ని చంద్రబాబు లాగా కేసిఆర్ ఆలస్యంగా తెలుసుకున్నారు. కనీసం కాంగ్రెస్ తో నైనా సఖ్యతగా ఉంటే భవిష్యత్తు ఉంటుందని ఆలోచనలు కేసిఆర్ లో ఉన్నాయి. కేకే రావడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు పెద్దగా ఇష్టం లేకపోయినా కేంద్ర నాయకత్వం అదేశాల తో చప్పుడు కాకుండా ఉన్నారు. మొన్న జరిగిన ఆప్ కి ఆదాలత్ లో సాక్షాత్తు సీఎం రేవంత్ చెప్పిన మాటలు కూడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కెసిఆర్ పై ప్రతీకార చర్యలు గాని, ఎదురుదాడిగానీ మొదలు పెట్టలేదని చెప్పడం వెనుక ఆంతర్యం కూడ ఇదే ! అందుకే కాంగ్రెస్ ఇప్పటివరకు కెసిఆర్ అవినీతి గురించి మాట్లాడం తప్ప, నిజాయితీగా ఒక్క చర్యనైన తీసుకోకపోవడం పై ప్రజల్లో అనుమానాలు మొదలైనాయి. కవిత అరెస్టు తొ బీజేపి వైపూ ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులోనైనా కేటీఆర్ కైనా లీగల్ నోటిస్ లేదా అరెస్టు చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుందని ప్రజల ఆశిస్తున్నారు, అయితే అలాంటి చర్యలు కనుచూపుమేరలో కనబడకపోవడం ఆశ్చర్యకరం. మల్లారెడ్డి పైనా ఎంతో కొంత అలజడి చేసి అపైనా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళడం అనుమానాలకు తావిస్తున్నది. రేవంత్ రెడ్డి పాలనా పైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆరు హామీలను నెరవేర్చాలని అడుగుతున్న వాళ్ళు లేరు. కానీ జైలుకి పంపిస్తానని అధికారం లోకి వచ్చీ చాడి చప్పుడు చెయ్యకుండా వెళ్ళడం తో ప్రజల్లో అయోమయంలో పడ్డారు. కేసిఆర్ కంటే కేటీఆర్ పైననే ప్రజలలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఎన్నికల ముందు వరకు బి ఆర్ ఎస్ నాయకుల పై చర్యలు లేకపోతే కాంగ్రెస్ కి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శకులు అంటున్నారు. ఎలాంటి చర్యలు లేనిచో తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి