కెసిఆర్ ను సింహం- పులి అని చెబుతున్నారు కదా మరి బయటకు ఎందుకు రావడం లేదు, నేను పిల్లులు, కుక్కలతో పోరాడే వాడిని కాదు, పులులు ,సింహాలతో పోరాడే వాడిని..
కెసిఆర్ జైలుకు పంపిన దానికి ప్రతికార చర్యలు మొదలు పెట్టలేదు , అసలు కవిత అరెస్టుపై తెలంగాణ లో ఒక్కరు కూడ మాట్లాడుకోవడమే లేదు, ఇది ఒక సమస్యగా ఒక చర్చగా లేనేలేదు, అందరూ స్వాగతిస్తున్నారు కూడ , కేటీఆర్ మిడిమిడి సంతోషం రెండు నెలలు తేలిపోతుంది, బిజెపి బి ఆర్ ఎస్ కీ డబ్బులు ఇచ్చి అపవిత్ర పొద్దుకు సిద్ధమైంది, బిజెపికి దేశంలో 240 సీట్లు రావడమే కష్టంగా ఉంది, 400 సీట్లు రావాలంటే ఇక పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా గెలవాల్సిందే సుమా, మోడీని మెచ్చుకోలేదు తెలంగాణ రాష్ట్రానికి సరిపడా నిధులు ఇచ్చి పెద్దన్న గా ఉండుమని చెప్పా . మోడి ప్రధాని తో భేటీ అదీ ప్రభుత్వ నేతల మధ్య భేటీగా మాత్రమే చూడాలి, పీఎం ,సీఎమ్ మాట్లాడుకోకపోతే, కలవకపోతే ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, అదానికి దేశాన్ని చౌకగా దోచిపెడుతున్నారు నిజమే,కానీ ఆ దోచిన్ డబ్బును తెలంగాణలో పెట్టుబడి పెట్టించిన ఘనత నాదే, పెట్టుబడులకు భరోసా ఇస్తాను. దోపిడీ చేస్తానంటే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు, కేటీఆర్ అపరిపక్క మాటలు మాట్లాడుతున్నాడు, అధికార కోసం అయితే బిజెపిలో చేరి ఎప్పుడో కేంద్రంలో మంత్రిని అయ్యే వాణ్ణి కదా, నేను ఒక రాష్ట్రానికి సీఎం గా ఉండి బిజెపిలో చేరాల్సిన అవసరం ఏంటో అసలు కేటీఆర్ మతితో మాట్లాడుతున్నారా ? మతితప్పి మాట్లాడుతున్నారా ? ప్రజలు నవ్వుకుంటున్నారు . నేను పోరాడే సీఎం అయ్యా తప్ప ఎవరి దయ దక్షణాలతో కాదు, మోడీ నాయకత్వంలో బిజెపి పట్టాలు తప్పింది, ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ సంచలన మాటల తూటాలు. ఆప్ కి అదాలత్ లో ముఖ్యమంత్రి కి ప్రజల నుంచి కూడ జోరుగా చెప్పట్ల వర్షం కురిపించారు..