Tuesday, March 11, 2025

MANSION HOUSE NINTY  WINE షాప్ లో నిల్ ….బెల్ట్ షాప్ లో ఫుల్….ESICE అధికారులను అడిగితే బెదిరింపులు

  సంగారెడ్డి జిల్లా  బీరం గూడ ఏరియా లో మంచి పేరున్న మద్యం దుకాణం(wine shop)లో MANSION HOUSE NINTY కావాలంటే లేదు అనే సమాధానం వస్తది.ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.మరోసారి ప్రశ్నిస్తే..ఏమిచేసుకుంటావో చేసుకో అన్నట్లు వాళ్ల హావభావాలు కనిపిస్తుంటాయి…NNITY తీసుకొని సరిపుచ్చుకొని ఉన్న అరకొర డబ్బులు తొ ఏదో కొద్దిగా తెసుకొని ప్రశాంతంగా ఇంటికి పోయి ప్రశాంతంగా ఉందామని ఇంటికి పోతే ఆ మద్యం షాప్ వాడు చూసే చూపులు ,..అతని ఆహభావాలు నన్ను ఎంతో కలచి వేశాయి.తెలంగాణలో ప్రభుత్వం మారింది న్యాయం జరుగుతుంది అన్న ఆశ తో సంబధిత అధికారికి ఫోన్ చేశాను. ఆ అధికారి  కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండ(చేయమని నేను ఆశించలేదు)వచ్చి…WINE షాప్ లో కూర్చోకుండా పక్కన ఉన్న ఏ.సి హాల్ లో కూర్చొని( ఏమి మాట్లాడుకున్నారో తెలవదు.)..నేను వెళ్లి మీరేనా సంబంధిత అధికారి అని అడిగాను.ఆయన గారికి కోపం ఎందుకు వచ్చిందో తెలవదు..లేదా..మద్యం యాజమాన్యాన్ని సంత్రుప్తి పరచాలి అనుకున్నాడో తెలవదు….నా మీద కోపాన్ని ప్రదర్శించ బోయాడు…”నున్ను ఇబ్బంది  పెడుతన్నావు” అంటూ అక్కడ సిబ్బందిని వీడియో తీయి అని బెదిరించి… పోలీసులకు ఫిర్యాదు ఇస్తానన్నాడు…అక్కడ ఉన్న నేను  రిక్వెస్ట్ చేసి మొత్తం వీడియో తీయమన్నాను.ఇదంతా ఎందుకు రాస్తున్నాను…. అంటే ప్రభుత్వాలు మారిన…పాలకులు మారిన..అధికారుల్లో మార్పు రాకపోతే..ప్రజాస్వామ్యం లో మార్పు రాదు…. …రేవంత్ రెడ్డి మంచి పాలకుడు అనుకుంటున్న..ఆయనకు చెడ్డ పేరు తెవద్దు…SI NAME : RAMULU ,PLACE OF WORKING PATANCHERVU… ఆయన వేరే మాటలు కూడా అన్నాడు…ఫ్రెండ్లీ పోలీస్ మంచిగా ఉంది ఫ్రెండ్లీ ఎక్సయిజ్ కూడా పోలీసులను చూసి నేర్చుకోండి దయచేసి

Note: మన పాలకులు బెల్ట్ షాపులు నియంత్రిచలేరు….నాకు ఆ ఆశ కూడా లేదు….. WINE షాప్ లో కూడా అన్ని ఉండాలి అనేదే నా కోరిక….లేదా బెల్ట్ షాప్ లను నియంత్రించేయలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కూడా లైసెన్స్ లు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా….

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img